విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Education: విద్యకు భారీగా కోతలు  


దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి భారీగా కోతపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1.20 లక్షల కోట్లే ఇచ్చి.. రూ.9వేల కోట్లు తగ్గించారు. కొన్నింటికి పెంచి, మరికొన్నింటికి తగ్గించారు. ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు గత బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు, ఈసారి రూ.1,800 కోట్లు కేటాయించారు. యూజీసీకి అత్యధికంగా 60.99 శాతం తగ్గింది. గత సంవత్సరం రూ.6,409 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.2,500 కోట్లకు పరిమితం చేశారు. ఐఐఎంలకూ రూ.331 కోట్ల నుంచి రూ.212 కోట్లకు తగ్గించారు. ఐఐటీలకు గత సంవత్సరం రూ.10,384.21 కోట్లు కేటాయించగా, ఇప్పుడది రూ.10,324.50 కోట్లకు చేరింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రం 28% పెంచారు. గత సంవత్సరం రూ.12,000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి అది రూ.15,472 కోట్లయ్యింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఎన్‌సీఈఆర్‌టీ, పీఎంశ్రీ పాఠశాలలకు కొద్దిగా పెరిగింది.


* స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకు రూ.10లక్షల రుణం


స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యారుణాలు ఇస్తారు. యేటా లక్ష మంది విద్యార్థులకు వడ్డీలో 3% రాయితీ అందుతుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ పథకాల కింద లబ్ధికి అర్హులు కాని యువత కోసం ఈ రుణ పథకం ప్రవేశపెట్టినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3% వడ్డీ రాయితీకి ఈ-ఓచర్లను నేరుగా విద్యార్థులకే అందిస్తామన్నారు.
 

Updated at : 24-07-2024 15:40:53

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం