• facebook
  • whatsapp
  • telegram

Inter: ఇంటర్‌లో ఆంగ్ల భాషా నైపుణ్యాలపై పరీక్ష

* నాలుగు దశల్లో నిర్వహించే పరీక్ష

న్యూస్‌టుడే, భూపాలపల్లి: ఇంటర్‌ స్థాయిలోనే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం.. వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో ప్రయోగ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనుంది. జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులందరూ తప్పకుండా ఈ పరీక్షకు హాజరుకావాలి. మొత్తంగా 80 మార్కులు థియరీకి కేటాయించగా ప్రయోగాలకు 20 కేటాయించారు. నాలుగు దశల్లో నిర్వహించే పరీక్షలో 20 మార్కులకు కనీసం 7 వస్తేనే ఉత్తీర్ణులవుతారు. గైర్హాజరైన విద్యార్థులను ఆనుత్తీర్ణులుగా పరిగణిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు విడతల్లో ప్రయోగ పరీక్షలు జరిగాయి. చివరి పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనుండగా ఇందుకోసం విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల ప్రయోగాలకు హాజరుకాని వారు కూడా నాలుగో విడతలో హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు.

* నాలుగు విడతల్లో..

ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,816 మంది ఉన్నారు. వీరందరికీ ఆంగ్ల ప్రయోగ పరీక్షను పరికరాలతో కాకుండా తరగతి గదిలోనే విద్యార్థుల భాషా సామర్థ్యాల పరిశీలనతో నిర్వహిస్తున్నారు.

కమ్యూనికేషన్‌ ఫంక్షన్‌ మొదటి దశలో ఏదైనా ఒక అంశంపై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు సంభాషించుకునే తీరును అధ్యాపకులు పరీక్షిస్తున్నారు.

రెండో దశలో ‘జస్ట్‌ ఎ మినిట్‌’ పేరిట ఒక అంశంపై నిమిషంలోపు అనర్గళంగా మాట్లాడాల్సి ఉంటుంది.

మూడో దశ ‘రోల్‌ ప్లే’లో తల్లిదండ్రులు లేదా మరేదైనా అంశంపై విద్యార్థులు బృందంగా చర్చించాలి.

ఫిబ్రవరి 16న నాలుగో దశలో ‘లిజనింగ్‌ కాంప్రహెన్సివ్‌’ పేరిట గ్రహించే శక్తి పెంపొందించడంపై అధ్యాపకులు పరీక్షిస్తారు. వీటితో పాటు రికార్డు బుక్‌ ఉంటేనే వారి ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు.

* 19న పర్యావరణ విద్య

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నైతికత- మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్ష కోసం సన్నద్ధం చేయిస్తున్నారు. కొత్తగా ఆంగ్లంలో ప్రయోగ పరీక్ష ఉండటంతో రెగ్యులర్‌ విద్యార్థులకు నైతికత- మానవ విలువలు అనే ఆంశంపై పరీక్ష నిర్వహించడం లేదు. గతంలో అనుత్తీర్ణులైన వారికి మాత్రమే ఫిబ్రవరి 17న నిర్వహించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 19న నిర్వహించే పర్యావరణ విద్య పరీక్ష మాత్రం రెగ్యులర్‌ విద్యార్థులు కూడా రాయాల్సి ఉంటుంది.
పట్టు పెంచడానికే

* దేవరాజం, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ ఏడాది ప్రయోగ పరీక్ష ఆంగ్ల సబ్జెక్టుపై నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణతకు ఇది కొలమానం కానుంది. ఈ మేరకు కళాశాలల్లో అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ప్రయోగ పరీక్షకు హాజరుకావాలి



  టీఎస్‌పీఎస్సీజూనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్

♦ గణితశాస్త్రం 1A
♦ రసాయన శాస్త్రం
♦ వృక్షశాస్త్రం 
♦ జంతుశాస్త్రం
♦ భౌతికశాస్త్రం
♦ గణితశాస్త్రం 1B
►పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
నమూనా ప్రశ్నపత్రాలు 


 

  టీఎస్‌పీఎస్సీ సీనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్  

♦ గణితశాస్త్రం 2A
♦ గణితశాస్త్రం 2B
♦ భౌతికశాస్త్రం
♦ జంతుశాస్త్రం
♦ రసాయన శాస్త్రం
♦ వృక్షశాస్త్రం
 పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
 నమూనా ప్రశ్నపత్రాలు 



మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.