• facebook
  • whatsapp
  • telegram

Admissions: డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.విజయ్‌బాబు తెలిపారు. జులై 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఓఏఎండీసీ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్లకు, 29వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు చిట్టివలసలోని తమ కళాశాల ప్రాంగణానికి వస్తే ఉచితంగా ఆన్‌లైన్‌ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. గణితం, కామర్స్, జువాలజీ, బోటనీతో పాటు ఈ ఏడాది నుంచి హిస్టరీ, కెమిస్ట్రీలు కూడా మేజరు ప్రోగ్రాంగా ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 89788 83125 నంబరును ఫోనులో సంప్రదించాలన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.