• facebook
  • whatsapp
  • telegram

JEE Session2: చివరి విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 4 నుంచి  

* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

* తొలి విడత పేపర్‌-1కు 95.8 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తుది విడత (సెషన్‌ 2) పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. గతంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య జరుగుతాయని పేర్కొన్న ఎన్‌టీఏ... సీబీఎస్‌ఈ పరీక్షల నేపథ్యంలో ప్రారంభ తేదీని మార్చింది. ఫిబ్రవరి 1వ తేదీకి జేఈఈ మెయిన్‌ తొలి విడత (సెషన్‌ 1) పరీక్షలు ముగియడంతో, సెషన్‌ 2కు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు.

తొలి విడత పేపర్‌-1కు 95.8 శాతం హాజరు

ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.