• facebook
  • whatsapp
  • telegram

JNTUH: హైదరాబాద్‌ జేఎన్‌టీయూకు ఏ ప్లస్‌ గ్రేడ్‌

* అధికారికంగా ధ్రువీకరించిన న్యాక్‌ బృందం

JNTUH: ఈనాడు, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో న్యాక్‌ గుర్తింపు, ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది. న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) బృందం సభ్యులు మార్చి 2వ తేదీన అధికారికంగా ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించారు. గత ఏడాది ఏ గ్రేడ్‌ మాత్రమే రావటంతో జేఎన్‌టీయూ అధికారులు అప్పీలుకు వెళ్లారు. 90వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్‌పై ఈ గ్రేడింగ్‌ ప్రభావం చూపనుందని దరఖాస్తులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంపై నివేదిక పంపగా.. కొద్దిరోజుల క్రితం జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను న్యాక్‌ బృందం సభ్యులు సందర్శించారు. పరిశోధన వివరాలు గమనించిన బృందం ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించింది. దీనిపై వీసీ కట్టా నరసింహారెడ్డి ఆచార్యుల బృందాన్ని అభినందించారు. రాబోయే సంవత్సరంలో ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ సాధించేలా కృషి చేయాలన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.