1. శ్రీజకు డబ్ల్యూటీటీ టైటిల్
డబ్ల్యూటీటీ ఫీడర్ బీరుట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ గెలుపొందింది. లెబనాన్‌లోని బీరుట్లో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో శ్రీజ విజేతగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సింగపూర్ ప్రధానితో జైశంకర్ చర్చలు
సింగపూర్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి లీ సియేన్ లూంగ్‌తో చర్చలు జరిపారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోపాటు ఇతర సీనియర్ మంత్రులతోనూ సమావేశమయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. కక్ష్యలో శకలాలను మిగల్చని పీఎస్ఎల్వీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ మరో మైలురాయిని సాధించింది. ప్రయోగానంతరం భూకక్ష్యలో ఎలాంటి శకలాలకు తావులేని ‘జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్’ను విజయవంతంగా చేపట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ట్రంప్‌కు భారీ జరిమానా
తన సంపద గురించి అసత్యాలు ప్రచారం చేసిన కేసులో దిగువ కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. విద్యుత్ వినియోగంలో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో తెలంగాణ
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 2024 మార్చి నెలలో ఆరు రోజులు 30 కోట్ల యూనిట్లకుపైగా వినియోగం నమోదవడం సరికొత్త రికార్డు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా వీరేంద్రశర్మ
తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా వీరేంద్రశర్మ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
7. చిరుధాన్యాలపై సెస్ నివేదిక
వరి, పత్తి వంటి ప్రధాన పంటలకు పరిమితమవుతున్న రైతులను చిరు ధాన్యాల సాగు వైపు ప్రోత్సహించాలని.. వారికి అన్ని రకాలుగా మద్దతు నివ్వాలని ఆర్థిక, సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) సిఫారసు చేసింది. చిరుధాన్యాల సాగు వ్యయపరంగానేకాక... భూ ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.