• facebook
  • whatsapp
  • telegram

Medical Posts బోధనాసుపత్రుల్లో వైద్య పోస్టుల భర్తీ

* 255 స్పెషాల్టీ, 169 సూపర్‌ స్పెషాల్టీ వైద్యుల ఖాళీలకు నోటిఫికేషన్‌ 
 

ఈనాడు, అమరావతి: బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 255 స్పెషాల్టీ, 169 సూపర్‌ స్పెషాల్టీ వైద్యుల పోస్టుల భర్తీకి మంగళవారం(జనవరి 30) విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. స్పెషాల్టీ వైద్యుల (జనరల్‌ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రి తదితర) పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సూపర్‌ స్పెషాల్టీ వైద్యుల (కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితర)పోస్టులను లేటరల్‌ ఎంట్రీ (ఇన్‌సర్వీస్‌) విధానంలో భర్తీ చేయనున్నారు. వీటికి నేరుగా విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలను ఫిబ్రవరి 6న నిర్వహించనున్నట్లు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
 

 
నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి...
 

ఏపీ వైద్య కళాశాలల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 


 

ఏపీ వైద్య కళాశాలల్లో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.