• facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024 Result:  నీట్‌ యూజీ ఫలితాలు జూన్‌ 14న

* ఈ వారంలో ప్రాథమిక కీ విడుదల
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) ఫలితాల వెల్లడికి నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఈ వారంలో ప్రిలిమినరీ కీ విడుదలతో పాటు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం జూన్‌ 14న ఫలితాలతో పాటు తుది కీ విడుదలకానున్నాయి. పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మే 5న దేశవ్యాప్తంగా 571 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 




  నీట్‌ యూజీ 2024 వెబ్‌సైట్‌  

 

Published Date : 28-05-2024 12:47:07

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం