విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NEET: ‘నీట్‌’లో ఆ ప్రశ్నపై వివాదాన్ని తేల్చండి: సుప్రీం

* ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ

దిల్లీ: నీట్‌-యూజీ 2024 (NEET-UG 2024) పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్‌- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు మాత్రం ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు. దానికి మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్‌ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి, జూన్‌ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు దానిపై సమాధానం సమర్పించాలని ఐఐటీ- దిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. మే 4కు ముందే పేపర్‌ లీక్‌ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బిహార్‌ పోలీసుల దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ.. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా? అని ప్రశ్నించింది.
 

Updated at : 22-07-2024 17:58:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం