• facebook
  • whatsapp
  • telegram

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 ప్రాథమిక కీ విడుదల  

* మొత్తం 1,762 ఉద్యోగాల భర్తీ
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023(SSC CHSL) టైర్‌-2 ప్రాథమిక కీని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(Staff Selection Commission) విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలతో ప్రాథమిక కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలను జనవరి 13 నుంచి 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్‌ 2న పరీక్ష నిర్వహించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,762 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి మే నెలలో ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు (Jobs) ఎంపిక చేస్తారు. 
 

సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2 ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి

 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.