• facebook
  • whatsapp
  • telegram

SSC Selection Posts: వచ్చేస్తోంది సెలక్షన్‌ పోస్టులకు నోటిఫికేషన్

* గతేడాది 5369 ఖాళీల భర్తీ
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌(ఫేజ్‌-XIII) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌ఎస్‌సీ జాబ్‌ క్యాలెండర్‌-2024 ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటన జారీ కావాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలు ఏప్రిల్‌/ మేలో నిర్వహించనున్నారు. రాతపరీక్ష(CBT), స్కిల్‌టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్ తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. గతేడాది 5369 సెలక్షన్‌ పోస్టులను భర్తీ చేశారు. సెలక్షన్‌(Phase-XIII) నోటిఫికేషన్ ద్వారా ఇన్వెస్టిగేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్ (Accountant), ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రిసెర్చ్(Research) ఇన్వెస్టిగేటర్, రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 
 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.