* తాత్కాలిక ప్రాతిపదికన నియామకం
హైదరాబాద్: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ప్రకటించారు. వాటిలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 8, టెక్స్టైల్ డిజైనర్ ఉద్యోగాలు 22 ఉన్నట్టు తెలిపారు. ఐఐహెచ్టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆమె వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుందని శైలజారామయ్యర్ స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.