* వివిధ ప్రవేశ పరీక్ష తేదీలివే..
* ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పేరును మార్చారు. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం(జనవరి 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్ష తేదీలు, నిర్వహించే యూనివర్సిటీ వివరాలను ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగనున్నాయి.
తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు...
పరీక్ష | తేదీలు | నిర్వహించే యూనివర్సిటీ |
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ | మే 9 నుంచి 11 వరకు | జేఎన్టీయూహెచ్ |
ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ | మే 12, 13 | జేఎన్టీయూహెచ్ |
ఈసెట్ | మే 6 | ఉస్మానియా |
ఐసెట్ | జూన్ 4 | కాకతీయ |
పీజీఈసెట్ | జూన్ 6 నుంచి 8 వరకు | జేఎన్టీయూహెచ్ |
పీఈసెట్ | జూన్ 10 నుంచి 13 వరకు | శాతవాహన |
ఎడ్సెట్ | మే 23 | మహాత్మాగాంధీ |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.