• facebook
  • whatsapp
  • telegram

TS High Court: 4 వారాల్లో నియామక ప్రక్రియ చేపట్టాలి

* కానిస్టేబుల్‌ పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టివేసిన హైకోర్టు
 

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ గురువారం (జనవరి 4) హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాలు ఉన్న నాలుగుప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలి (TSLPRB)ని ఆదేశించింది. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.