• facebook
  • whatsapp
  • telegram

TS Inter Exams: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

* ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ 

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/ ఒకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. రెండు సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు ఉంటాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు.


ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలివే..

ఫిబ్రవరి 28 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)

మార్చి 1 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్ పేపర్‌-1)

మార్చి 4 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)

మార్చి 6 -  మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1

మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1

మార్చి 13 - కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1

మార్చి 15 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)

మార్చి 18 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1


ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీలివే..

ఫిబ్రవరి 29 - పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)

మార్చి 2 - పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)

మార్చి 5 - పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)

మార్చి 7 - మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2

మార్చి 12 -  ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2

మార్చి 14 - కెమెస్ట్రీ పేపర్‌ -2,  కామర్స్‌ పేపర్‌-2

మార్చి 16 -  పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)

మార్చి 19 - మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.