• facebook
  • whatsapp
  • telegram

AP 10th Exams: 6 పేప‌ర్లు 33 ప్ర‌శ్న‌లు 100 మార్కులు

ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు ప్రారంభం

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్‌ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఏడు పేపర్ల విధానంలో పరీక్ష నిర్వహించగా, ప్రస్తుతం తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బిట్‌ పేపర్‌ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమూ ఒక కారణమైంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కరోనా సమయంలో వారి కింది తరగతుల్లో అభ్యసనను నష్టపోయారు. ఈ అంతరాన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభంనుంచి ఉపాధ్యాయులు ప్రయత్నించినప్పటికీ చాలా మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోలేకపోయారు. సీబీఎస్‌ఈ విధానంలో ఐదు పేపర్లు ఉన్నా.. ఆ విద్యార్థులకు 20 శాతం అంతర్గత మార్కులతోపాటు ప్రశ్నాపత్రంలోనే 20 మార్కులు బహుళైచ్ఛికం కావడం వెసులుబాటునిస్తుంది. రాష్ట్ర బోర్డుకు వచ్చేసరికి అంతర్గత మార్కుల విధానం లేదు. వంద మార్కులకు పూర్తిగా రాత పరీక్షే నిర్వహిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు జవాబు రాయాల్సిందే.

సామాన్యశాస్త్రం ఒక్క పేపరే..

గతేడాది వరకు భౌతిక, రసాయన శాస్త్రాలకు ఒక పేపర్‌, జీవశాస్త్రానికి మరో పేపర్‌ ఉండేది. ప్రస్తుతం సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు కలిపి ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. జీవశాస్త్రాన్ని ప్రశ్నాపత్రంలోనే ప్రత్యేక సెక్షన్‌గా విభజిస్తారు. భౌతిక, రసాయనశాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెక్టులో చిన్నచిన్న పాఠాలు 22 వరకున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్‌ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాలనుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్‌ లేదు. సాంఘిక శాస్త్రంలోనూ భూగోళం, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాల్లో కలిపి 22 అధ్యాయాలున్నాయి. గతంలో 11 పేపర్ల విధానం ఉన్నప్పుడు ఒక రోజు పరీక్ష బాగా రాయకపోతే మరో రోజు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉండేది.

విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అదనంగా సమాధాన పత్రాలు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. సామాన్యశాస్త్రం పరీక్షకు మాత్రం భౌతిక, రసాయన శాస్త్రాల జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్‌, జీవశాస్త్రానికి మరో 12 పేజీల బుక్‌లెట్‌ విడివిడిగా ఇస్తారు.

గతేడాది ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ల్లో వచ్చినందున ఈసారి ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్‌ తీసుకెళ్లకూడదనే నిబంధనను విధించారు.

=========================================================

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)

============================================================

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెనడాలో కోర్సులు చేసేద్దాం!

‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.