* అభ్యంతరాలకు గడువు మే 26
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 24 నుంచి 26వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు మే 26వ తేదీ ఉదయం 10.00 గంటల్లోగా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
AP EAPCET-2024 Master Question Papers With Preliminary Key (Engineering Stream)