• facebook
  • whatsapp
  • telegram

AP PGECET: ఏపీ పీజీఈసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

* మే 29 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2024 హాల్‌టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫయింగ్‌ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు మే 29 నుంచి 31వ తేదీ వరకు ప్రవేశ పరీక్ష జరుగనుంది. మే 31, జూన్‌ 1, 2 తేదీల్లో ప్రాథమిక కీ విడుదల; జూన్‌ 2, 3, 4 తేదీల్లో  ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ; జూన్‌ 28న ఫలితాల వెల్లడి కానున్నాయి.



  Download AP PGECET-2024 Halltickets  

 

Published Date : 23-05-2024 17:42:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం