* రెండు వారాల్లో తుది ఫలితాలు
ఏపీ ఎస్సై రాత పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటల లోపు SCTSI-PWT@slprb.appolice.gov.in లో తెలియజేయాలని సూచించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ కాపీలతో పాటు ఫలితాలను రెండు వారాల్లో ప్రకటించనున్నట్టు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్‌ఐ ఉద్యోగాల (SI posts) భర్తీకి ఏపీ పోలీసు నియామక బోర్డు(apslprb) ఫిబ్రవరి 19న రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,243మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పట్టణాలు/నగరాల్లోని 291 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు తెలిపారు.
ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష పేపర్-1 'కీ'
ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష పేపర్-2 'కీ'
ఏపీ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రం
‣ పేపర్-1 ప్రశ్నపత్రం కోడ్ - ఎ | ‣ పేపర్-1 ప్రశ్నపత్రం కోడ్ - బి |
‣ పేపర్-2 ప్రశ్నపత్రం కోడ్ - బి | ‣ పేపర్-2 ప్రశ్నపత్రం కోడ్ - సి |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.