• facebook
  • whatsapp
  • telegram

EAPCET: ముగిసిన ఈఏపీసెట్‌

* ఏపీ, తెలంగాణల్లో కలిపి 93% మంది హాజరు

* బైపీసీ విభాగం ప్రాథమిక ‘కీ’ విడుదల

* 24న అందుబాటులో ఎంపీసీ స్ట్రీమ్‌ ప్రాథమిక ‘కీ’ 


 


ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ గురువారం(మే 23)తో ముగిసింది. దీనికి రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లో కలిపి మొత్తం 93.47 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. అన్ని విభాగాలకు కలిపి 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,39,139 మంది పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,74,213 మందికి గాను 2,58,373 (94.22%) మంది హాజరయ్యారు. బైపీసీ స్ట్రీమ్‌కు 88,638 మంది దరఖాస్తు చేయగా.. 80,766 (91.12%) మంది పరీక్ష రాశారు. బైపీసీ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రాథమిక ‘కీ’ పై శనివారం (మే 25)ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలను తెలియజేయాలని సెట్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌ ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను శుక్రవారం (మే 24) ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఇంజినీరింగ్‌ ప్రాథమిక ‘కీ’ పై 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. దీని కోసం ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్‌ సూచించారు. 


 

AP EAPCET-2024 Master Question Papers With Preliminary Key (Agriculture and Pharmacy Stream)

16 May 2024 Forenoon

16 May 2024 Afternoon

17 May 2024 Forenoon

 17 May 2024 Afternoon

Published Date : 23-05-2024 20:17:39

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం