• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: 21 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌  

* సెప్టెంబరు 6న సీట్ల కేటాయింపు

* కాలపట్టికను ప్రకటించిన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగ‌స్టు 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన 23 నుంచి మొదలవుతుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఛైర్మన్‌గా ఉన్న ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం కాలపట్టికను ఖరారు చేసింది. కౌన్సెలింగ్‌ మూడు విడతలుగా జరగనుంది. సెప్టెంబరు 11న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌కు 30 - 35 రోజుల సమయం పడుతుంది. అక్టోబరు 15 - 20 తేదీల మధ్య చివరి విడత జోసా కౌన్సెలింగ్‌ పూర్తవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 11 నుంచి 21 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.తొలి విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఆగ‌స్టు 23 నుంచి మొదలవుతున్నందున 22వ తేదీ నాటికి ఫీజులపై ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంది.

 

రింత సమాచారం ... మీ కోసం!

‣ తెలంగాణ ఎంసెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌ - 2022 ఇంజినీరింగ్‌

‣ తెలంగాణ ఎంసెట్‌ మాక్‌ కౌన్సెలింగ్‌ - 2022 అగ్రికల్చర్‌

 

‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు

‣ పైతాన్‌తో కెరియర్‌ పరుగులు!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.