• facebook
  • whatsapp
  • telegram

AP,TS GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల

* ధ్రువపత్రాల పరిశీలనకు గడువు జూన్‌ 16






ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి నాలుగో జాబితాను పోస్టల్ శాఖ తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో భారత తపాలా శాఖ 40,889 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జూన్‌ 16 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి.



ఆంధ్రప్రదేశ్‌ జీడీఎస్ 2023 ఫలితాలు(లిస్ట్‌-4) 

తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు(లిస్ట్‌-4) 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.