• facebook
  • whatsapp
  • telegram

Pratibha Model Papers: ఏపీ ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో ‘ఈనాడు-ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి 78 శాతం ప్రశ్నలు!  

* సబ్జెక్టుల వారీగా మార్కుల విశ్లేషణ

ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్‌ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్‌సైట్‌ అందించిన మోడల్ పేపర్ల నుంచి అధిక శాతం మార్కులు వచ్చాయి. వార్షిక పరీక్షలకు కొన్ని రోజుల ముందు సంవత్సరాల బోధనానుభం ఉన్న నిపుణులు రూపొందించిన మోడల్ పేపర్లను ‘ఈనాడు-ప్రతిభ’ విద్యార్థులకు అందించింది. అందులో ప్రతి సబెక్టుకు నాలుగు పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్ల నుంచి మొత్తం మీద సరాసరిన 78 శాతం ప్రశ్నలు ఫైనల్ పరీక్షల్లో కవర్ అయ్యాయి. అత్యధికంగా మొదటి సంవత్సరం ఫిజిక్స్‌ 93 శాతం మార్కులు, మ్యాథ్స్‌లో 81 శాతం; రెండో సంవత్సరం ఫిజిక్స్, బోటనీలో 93 శాతం మార్కులు, కెమిస్ట్రీ, జువాలజీలో 90 శాతం మార్కులు ఈనాడు-ప్రతిభ మోడల్ పేపర్ల నుంచి ఉండటం విశేషం. మొత్తంగా చూస్తే మొదటి సంవత్సరంలో 73 శాతం; రెండో సంవత్సరంలో 82 శాతం మార్కులు కవర్ అయ్యాయి. ఈ సందర్భంగా ఈనాడు-ప్రతిభ మోడల్ పేపర్ల ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.



 

జూనియర్ ఇంటర్‌లో ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కుల వివరాలు

 

సబ్జెక్టు   మొత్తం మార్కులు ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100 55
ఇంగ్లిష్ 100 50
గణితం 1A 75 53
గణితం 1B 75 69
భౌతికశాస్త్రం 60 56
రసాయనశాస్త్రం 60 54
వృక్షశాస్త్రం 60 46
జంతుశాస్త్రం 60 52


 

సీనియర్ ఇంటర్‌లో ‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కుల వివరాలు


 

సబ్జెక్టు

మొత్తం మార్కులు

‘ప్రతిభ’ మోడల్‌ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు
తెలుగు 100 60
ఇంగ్లిష్  100 78
గణితం 2A 75 69
గణితం 2B 75 60
భౌతికశాస్త్రం 60  56
రసాయనశాస్త్రం 60 55
వృక్షశాస్త్రం  60  56
జంతుశాస్త్రం 60 54


 

Updated Date : 20-04-2024 13:51:12

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం