* ఉదయం 11 గంటలకు విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను (TS Inter Results 2024) బుధవారం (ఏప్రిల్ 24) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 మూల్యాంకనం జరిగింది. ఈ ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్సైట్లో చూడవచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి....
Jr.INTER |
General |
Vocational |
Sr.INTER | General |
Vocational |
What Next After Intermediate?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.