• facebook
  • whatsapp
  • telegram

TS EAPCET: ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడంటే?

* అదే రోజు కౌన్సెలింగ్‌ తేదీల వెల్లడి 
 

ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఈఏపీసెట్‌ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తమవుతోంది. వచ్చే వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయని సమాచారం. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు. ప్రధాన కేంద్రాల్లో మే 7 నుంచి 11 వరకు ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల కాగా అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. పరీక్షకు దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.


 

  ఈఏపీసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   


 

Published Date : 16-05-2024 18:54:14

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం