విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 18-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ కొత్త రికార్డు!

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు (14) సమమైనప్పటికీ చెన్నై (+0.392) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు (+0.459) నాకౌట్‌కు వెళ్లిపోయింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. రణరంగంగా తైవాన్‌ పార్లమెంటు!

ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్‌ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి సభలో ప్రతిపక్షాలు బిల్లును ప్రతిపాదించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం!

‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు

ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో చంపువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సనాతన్‌ మహాకుడ్‌ రూ.227.67 కోట్ల ఆస్తులతో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్‌ పార్క్‌!

దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక. 25 వేల మందికి ఉపాధి అవకాశాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్‌పార్క్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Published at : 19-05-2024 15:56:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం