• facebook
  • whatsapp
  • telegram

TG Engineering Counselling: జూన్‌ 27 నుంచి ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్ ప్రవేశాలు 

* ఆగస్టు 5న సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌: తెలంగాణలో ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం (మే 24) సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారం కోసం టీజీఈఏపీసెట్ వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపింది. 

కౌన్సెలింగ్‌ ముఖ్య తేదీలు...

* జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. 

* జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం.

* జులై 12న మొదటి విడత  ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.

* జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్.

* జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు.

* జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్.

* ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

* ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయం.

* ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ.

* ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు.

* ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల.

Updated Date : 24-05-2024 17:09:52

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం