• facebook
  • whatsapp
  • telegram

Education: అంతర్జాలంలో విద్యానిధి

చదువుకోవడం సులభం..


నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ పేరుతో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను ఖరగ్‌పూర్‌ ఐఐటీ అభివృద్ధి చేసింది. ఇందులోని సమాచారం ఉచితంగా లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌ పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీఎల్‌ని ప్రారంభించింది. అన్ని భారతీయ భాషల నుంచి ముఖ్యమైన పుస్తకాలను ఇందులో పొందుపర్చారు. ఐఐటీ, జేఈఈ, నీట్, జామ్, గేట్, యూజీసీ, నెట్‌ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్, ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. 


రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా..

నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో తొలుత  https://ndl.iitkgp.ac.in.వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. పేరు, పుట్టిన తేదీ, పట్టణం/గ్రామం, మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్, చదువుతున్న విద్యాసంస్థ పేరు నమోదు చేయాలి. చదువు పూర్తయిన వారు జిల్లా గ్రంథాలయం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయిన తర్వాత కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక.. ఎన్నికల కోడ్‌ ముగియగానే పోటీ పరీక్షల కాలం మొదలు కానుంది. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జిల్లాలోని కేంద్ర గ్రంథాలయాలకు తాకిడి పెరగడంతో స్థలం దొరకడం గగనంగా మారింది. ఆర్థిక స్థోమత లేకపోవడం, పుస్తకాలు అందుబాటులో లేనప్పటికీ.. లక్ష్యం సాధించాలనే తపన ఉన్నవారికి ప్రస్తుతం అంతర్జాలం చక్కటి వేదిక. ఆన్‌లైన్‌ పరీక్షల సమాచారంతో పాటు ఉపయుక్తమైన సమగ్ర సమాచారంతో కూడిన ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ(ఎన్‌డీఎల్‌)’ వెబ్‌సైట్‌ బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతోంది.

పరీక్షల తేదీలు

పోస్టుల సంఖ్య    

గ్రూపు-1  563    ప్రిలిమ్స్‌ జూన్‌ 09 

మెయిన్స్‌ అక్టోబరు 21 నుంచి

గ్రూపు-2  783      ఆగస్టు  7, 8 

గ్రూపు-3 1,388      నవంబరు 17, 18


68 లక్షల పుస్తకాలు..

వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు ఈ ఎన్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పాత మాదిరి ప్రశ్నపత్రాలు, విజేతల అనుభవాలు పుస్తక రూపంలో ఉంటాయి.  ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్‌ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.  

Published Date : 27-05-2024 12:16:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం