• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  ఐపీఎల్‌-17 ఛాంపియన్‌గా నైట్‌ రైడర్స్‌ 
ఐపీఎల్‌-17 ఛాంపియన్‌గా నైట్‌ రైడర్స్‌ కోల్‌కత్తా నిలిచింది. చెపాక్‌లో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

2.  బంగాళాఖాతంలో ‘రెమాల్‌’ తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

3.  మెదడును తొలిచేస్తున్న వైరల్‌ డీఎన్‌ఏ!
మానవ డీఎన్‌ఏలో 8 శాతాన్ని పురాతన వైరస్‌ల నుంచి సంక్రమించిన జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయి. ఈ జన్యుక్రమాలను హ్యూమన్‌ ఎండోజీనస్‌ రెట్రోవైరసెస్‌ (హెర్వ్స్‌)గా పిలుస్తున్నారు. ఇవి వేల సంవత్సరాల నాటివి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం
హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరిగింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  టెల్‌ అవీవ్‌పై హమాస్‌ రాకెట్ల దాడి!
ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై హమాస్‌ రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. భారీగా పొగలు వస్తున్న దృశ్యాలూ కనిపించాయి. టెల్‌ అవీవ్‌లో సైరన్లు మోగడం ఐదు నెలల కాలంలో ఇదే తొలిసారి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Updated Date : 27-05-2024 19:02:11

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం