* 24 విశ్వవిద్యాలయాలు, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిని ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో అందుబాటులో ఉంచనున్నారు.
అందుబాటులోకి రాని వెబ్ ఆప్షన్లు..
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా జులై 8న నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇది అందుబాటులోకి రాలేదు. కళాశాలలకు అనుమతుల జీఓను ఉన్నత విద్యాశాఖ జులై 8న ఇచ్చింది. వీటిని కౌన్సెలింగ్కు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. జులై 9 నుంచి ఐచ్ఛికాలకు అవకాశం కల్పించేందుకు ఆన్లైన్లో ఫీజులు, కళాశాలల వివరాలను నమోదు చేస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.