* 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 2,144 పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి, 1,276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురువారం (ఫిబ్రవరి 8) జాబితాలు విడుదల చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి రోజువారీగా కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తిచేసింది. వారం రోజుల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) మినహా మిగతా వాటికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.