* 227 రోజులపాటు తరగతులు
* అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించిన బోర్డు
ఈనాడు, హైదరాబాద్: వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు శనివారం(ఏప్రిల్ 1) ప్రకటించింది. వేసవి సెలవులు మొదలైన రోజే విద్యా క్యాలెండర్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మొత్తం 227 రోజులపాటు కళాశాలలు పనిచేస్తాయి. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు 304 రోజుల్లో 77 రోజులు ఆదివారాలు, పండగలు, ఇతర సెలవులు ఉంటాయి. అంటే 227 రోజులు తరగతులు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా జూన్ 1వ తేదీ నుంచే తరగతులు ప్రారంభమవుతాయా? అన్న దానిపై స్పష్టత లేదు.
విద్యా క్యాలెండర్‌లో ముఖ్యాంశాలు
* 2023 అక్టోబరు 19 నుంచి 25 వరకు: దసరా సెలవులు
* నవంబరు 20 నుంచి 25 వరకు: అర్ధ సంవత్సర పరీక్షలు
* 2024 జనవరి 13 నుంచి 16 వరకు: సంక్రాంతి సెలవులు
* జనవరి 22 నుంచి 29 వరకు: ప్రీ ఫైనల్ పరీక్షలు
* ఫిబ్రవరి 2వ వారంలో: ప్రాక్టికల్స్
* మార్చి మొదటి వారంలో: వార్షిక పరీక్షల ప్రారంభం
* ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు: వేసవి సెలవులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.