1. పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్
రాష్ట్రంలోని పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొన్ని తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మారనుంది. ఏలూరు వచ్చిన ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంచాలకుడు కె.రవీంద్రనాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. ‘9వ తరగతి సిలబస్ పూర్తిగా మారనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో.....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఇగ్నో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు 27 వరకు పొడిగింపు
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు చివరి తేదీని మార్చి 27 వరకు పొడిగించినట్లు ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సులలో ప్రవేశం పొందడానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రాష్ట్రంలో 218 మంది వైద్యుల నియామకం
రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 285 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు సంబంధించి మార్చి 21న వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్‌లో 218 మందికి నియామక పత్రాలను అందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సహాయ ఆచార్యులను నెలాఖరులోగా నియమించాలి
బోధనాసుపత్రుల్లో 1,442 సహాయ ఆచార్యుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆరోగ్యశ్రీ అమలు, పురోగతిపై మంత్రి మార్చి 21న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఆన్లైన్(జూమ్) ద్వారా సమీక్షించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. సంస్కరణల బాటలో టీఎస్పీఎస్సీ
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ భారీ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. కమిషన్‌ను పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్తులో లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల నియామకాలు, ఉద్యోగుల ప్రవర్తన నియామావళి, పోటీ పరీక్షల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వరకు భారీ మార్పులు జరగనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.