• facebook
  • whatsapp
  • telegram

Veternary Colleges: 3 జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలలు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో రూ.12.75 కోట్లతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ను న‌వంబ‌రు 29న‌ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఆసుపత్రిలో అన్ని రకాల పశువులకు అత్యవసర, ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో నూతనంగా వరంగల్‌, వనపర్తి జిల్లాల్లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కొత్త వెటర్నరీ కళాశాలలు నెలకొల్పనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.