మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెమిస్టర్-1 పరీక్షల రుసుం వచ్చే నెల 10వ తేదీ లోపు చెల్లించాలని సహాయ సంచాలకుడు ఎం.అజంతకుమార్ తెలిపారు. రూ.500ల అపరాధ రుసుంతో వచ్చే నెల 15వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెమిస్టర్-1 పరీక్షలు జరుగుతాయని వివరించారు. పూర్తి వివరాలకు 0866-2434868, 73829 29642 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.