• facebook
  • whatsapp
  • telegram

 Polyset: 1 నుంచి ఉచిత పాలీసెట్‌ శిక్షణ

మాచవరం, న్యూస్‌టుడే : ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉచిత పాలీసెట్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కె.భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మార్చి 26న  కళాశాల ప్రాంగణంలో ప్రచార గోడపత్రాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ పలు సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పాలీసెట్‌ శిక్షణ కేంద్రాన్ని కళాశాలలో నిర్వహిస్తున్నారని, తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అనుభవజ్ఞులు తర్ఫీదు ఇస్తారని, ఉచితంగా మెటీరియల్‌ అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పలువురు శిక్షణ తీసుకొని మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ కళాశాలల్లో సీటు సాధించారన్నారు. పదో తరగతి పరీక్షలు రాసినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు ఎస్‌.కె.జాహిద, భార్గవ, బి.మాధవ్, టి.ప్రణీత, మణికంఠ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో.. 

కరెన్సీనగర్, న్యూస్‌టుడే : పాలీసెట్‌ రాసే అభ్యర్థులకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఎం.విజయసారథి  మార్చి 26న తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు పాలీసెట్‌ దరఖాస్తు చేసుకున్నాక, ఫీజు చెల్లించిన రశీదుతో తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. శిక్షణ తరగతులు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతాయని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇతర వివరాలకు 94926 85021 నెంబరులో సంప్రదించాలని చెప్పారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.