ఇంటర్న్‌షిప్ నిబంధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఎండీఎస్ 2023 పరీక్షకు మార్చి 31లోగా ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలన్న నిబంధనతో నిమిత్తం లేకుండా పిటిషనర్ దరఖాస్తును స్వీకరించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించాలన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్.వినీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాళోజీ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో చేసిన జాప్యం వల్ల ఎన్‌బీఈఎంఎస్ నిబంధనల ప్రకారం మార్చి 31లోగా ఇంటర్న్‌షిప్ పూర్తిచేసే అవకాశం లేదని, 11 రోజులు తక్కువ అవుతోందన్నారు. అయితే ఇంటర్న్‌షిప్ పూర్తికాకుండా నీట్ ఎండీఎస్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోతోందన్నారు. కొవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగిందని కాళోజీ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి నోటీసులు జారీచేస్తూ విచారణను ఫిబ్రవరి 22కి వాయిదా వేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.