• facebook
  • whatsapp
  • telegram

RRB Annual Calendar: రైల్వే ఉద్యోగాల క్యాలెండర్-2024 విడుదల

* ఎన్‌టీపీసీ, ఇంజినీర్‌ నియామకాలు ఎప్పుడంటే?

* ఆర్‌ఆర్‌బీ సిలిగురి వెల్లడి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి కేంద్రీకృత వార్షిక క్యాలెండర్‌ను జారీ చేసింది. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను ఆర్‌ఆర్‌బీ సిలిగురి అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. 9 వేల టెక్నీషియన్ ఖాళీల భర్తీకి రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వార్షిక క్యాలెండర్‌లో ఏఎల్‌పీ, టెక్నీషియన్, జేఈ తదితర పోస్టుల నియామక షెడ్యూల్‌ వివరాలు ఉన్నాయి. 


కేంద్రీకృత వార్షిక క్యాలెండర్‌ 2024 వివరాలు...


 

కేటగిరీ నియామక షెడ్యూల్‌
అసిస్టెంట్ లోకో పైలట్ జనవరి - మార్చి
టెక్నీషియన్ ఏప్రిల్‌ - జూన్‌
నాన్-టెక్నికల్ పాపులర్‌ కేటగిరీ- గ్రాడ్యుయేట్‌ (లెవెల్‌ 4, 5, 6)
జులై- సెప్టెంబర్‌
 
నాన్-టెక్నికల్ పాపులర్‌ కేటగిరీ- గ్రాడ్యుయేట్‌ (లెవెల్‌ 2, 3)
జూనియర్ ఇంజినీర్
పారామెడికల్ కేటగిరీ                
లెవెల్ 1, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలు  అక్టోబర్‌- డిసెంబర్‌

 

  ఆర్‌ఆర్‌బీ సిలిగురి అధికారిక ప్రకటన  


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.