* జులై 14 నుంచి 17 వరకు సీజీఎల్ పరీక్షలు
ప్రతిభ డెస్క్: కేంద్ర ప్రభుత్వ విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష నిర్వహణ తేదీలను తాజాగా ప్రకటించింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్-2022ను మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ తెలిపింది. అలాగే సబ్ ఇన్‌స్పెక్టర్(దిల్లీ పోలీస్), సీఆర్‌పీఎఫ్-2022(టైర్-2)ను మే 2న, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్-2022(టైర్-2)ను జూన్ 26న, సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్-2023 జూన్ 27 నుంచి 30 వరకు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్-2023(టైర్-1)ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.