* 9 రోజుల పాటు సబ్జెక్టులపై అవగాహన
హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్ నెట్వర్క్ ప్రత్యేకంగా లైవ్ తరగతులు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 18 నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్లో వివిధ సబ్జెక్టులపై అవగాహన తరగతులు కొనసాగనున్నాయి. వివిధ సబ్జెక్టులపై ప్రసారమయ్యే ఈ లైవ్ ప్రోగ్రామ్స్‌ను మరుసటిరోజు విద్య ఛానల్లో సాయంత్రం 6 గంటల నుంచి పునఃప్రసారమవుతాయి. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసేవారు తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వారా చర్చలో పాల్గొని నివృత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం 040-23540326, 23540726 నంబర్లతో పాటు టోల్‌ఫ్రీ నంబర్ 1800 825 4039ను సంప్రదించవచ్చు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.