విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

TGSRTC ITI Admissions: టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలు  

* జూన్ 10 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 

హైదరాబాద్‌: వరంగల్‌, హైదరాబాద్‌ విద్యార్థులకు టీజీఎస్‌ఆర్‌టీసీ సువర్ణావకాశం అందిస్తోంది. ఈ రెండు నగరాల్లోని టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు జూన్ 10 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌ (రెండేళ్లు), మెకానిక్‌ డీజిల్‌ (ఏడాది), వెల్డర్‌ (ఏడాది), పెయింటర్‌ (రెండేళ్లు) ట్రేడ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌లకు పదో తరగతి అర్హత కాగా.. మిగతావాటికి ఎనిమిదో తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.

స్వయంఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు. పూర్తి వివరాలను https://iti.telangana.gov.inవెబ్‌సైట్‌లోనూ పొందొచ్చు.

Updated at : 27-05-2024 20:27:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం