• facebook
  • whatsapp
  • telegram

TGSRTC: మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ కొలువుల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సారించింది. సంస్థలో ఉద్యోగాలను గతంలో ఆర్టీసీనే సొంతంగా భర్తీ చేసింది. ఇప్పుడు ఇతర సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మొత్తం 11 రకాల పోస్టులను మూడు రకాలుగా వర్గీకరించింది. తాజా నియామకాలను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, మెడికల్‌ బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీ ప్రతిపాదనలు రూపొందించగా... రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు రవాణా సంస్థలో పన్నెండేళ్ల తర్వాత ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మినహా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా జరిగింది. సంస్థే నియామకాలను చేపట్టింది. మూడు సంవత్సరాల క్రితం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ మాత్రం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేపట్టింది.

ఉద్యోగులపై పనిభారం

చాలాకాలంగా నియామకాలు లేకపోవడంతో ఆర్టీసీలో భారీ ఎత్తున ఖాళీలున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లు సహా వివిధ విభాగాల్లో సుమారు 11 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. అనేక డిపోల్లో డ్రైవర్లు అదనపు గంటలు పని చేస్తున్నారు. డబుల్‌డ్యూటీలు చేసేవారికి యాజమాన్యం ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. అయినా సమస్య తీరడం లేదు. సర్వీసులో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశం కల్పిస్తుండగా ఇలా దాదాపు వెయ్యి మంది కండక్టర్లు రానున్నారని తెలుస్తోంది. అందుకే తాజా నియామకాల్లో కండక్టర్‌ పోస్టులను చేర్చలేదని ఓ అధికారి తెలిపారు.

భర్తీ ఇలా?

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుతో: డ్రైవర్‌ పోస్టులు 2,000, శ్రామిక్‌ 743, డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) 84, డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానికల్‌) 114 ఉద్యోగాల భర్తీ.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో: డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ 25 పోస్టులు, అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ 15, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 23, సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) 11, అకౌంట్స్‌ ఆఫీసర్‌ 6 ఉద్యోగాల భర్తీ.

మెడికల్, హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుతో: మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) 7, మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) 7 పోస్టుల భర్తీ.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.