* ఉద్రిక్తతకు దారితీసిన డీజీపీ కార్యాలయ ముట్టడి
నారాయణగూడ, న్యూస్‌టుడే: కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ జీవోతో తమకు అన్యాయం జరుగుతోందంటూ గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సెప్టెంబరు 1న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రామీణ జిల్లాల నిరుద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో టీఎస్‌ఎస్‌పీతోపాటు ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు కార్యాలయం వైపు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకున్నా.. వారి నుంచి తప్పించుకుని మరీ డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు. తిరిగివారిని పోలీసులు అసెంబ్లీ వద్ద నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగ ఐకాస నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరికొందరు అభ్యర్థులు పోలీసులను తప్పించుకొని డీజీపీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రద్దీ సమయంలో ఆందోళన జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే 50 శాతానికిపైగా పోస్టుల్ని కేటాయించడంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో 46ను ఉపసంహరించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
‣డాక్టర్ వైఎస్సార్ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.