• facebook
  • whatsapp
  • telegram

TS Inter Results: వచ్చే వారంలో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు?

* ఇప్పటికే మూల్యాంకనం పూర్తి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 23 లేదా 24వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా.. నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఏప్రిల్‌ 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఈసీ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం.



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.