• facebook
  • whatsapp
  • telegram

TS Police: 14 నుంచి పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

* రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల ఏర్పాటు

* 11 నుంచి 13వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో ఇంటిమేషన్‌ లెటర్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా తుది రాతపరీక్షలో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను జూన్‌ 14 నుంచి 26 వరకు పరిశీలించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి 18 కేంద్రాల్ని ఎంపిక చేసింది. రోజుకు సగటున దాదాపు 9 వేల మంది చొప్పున మొత్తం 1,09,906 మంది పత్రాల్ని పరిశీలించనున్నారు. జూన్‌ 11న ఉదయం 8 గంటల నుంచి 13న రాత్రి 8 గంటల వరకు అభ్యర్థుల ఇంటిమేషన్‌ లెటర్లను మండలి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రక్రియ సాగుతుంది ఇలా..

* అభ్యర్థులకు కేటాయించిన తేదీన ఉదయం 9 గంటలకు ఆయా కేంద్రంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఇంటిమేషన్‌ లెటర్‌ను తప్పనిసరిగా చూపించాలి. 

* దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు నేరుగా పత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. ఒకవేళ సవరణల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకొని ఉంటే ఆ ప్రతిని తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణల్ని మండలివర్గాలు ఆమోదిస్తాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి కొన్ని పోస్టుల్లో అదనపు మార్కులు కలపనున్నట్లు నోటిఫికేషన్‌లోనే ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు సంబంధిత వివరాలను అందజేయాలి.

* ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఫొటోకాపీలను తీసుకురావాలి. వాటిని పరిశీలించిన అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది.

పరిశీలన కేంద్రాలు ఎక్కడెక్కడంటే..

యూనిట్‌         కేంద్రం                   అభ్యర్థులు
ఆదిలాబాద్‌         ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌              4918
సైబరాబాద్‌         సైబరాబాద్‌ కమిషనరేట్‌ గ్రౌండ్‌     8509
హైదరాబాద్‌         గోషామహల్‌ స్టేడియం         7459
కరీంనగర్‌         పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌         5814
ఖమ్మం         సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌          6425
కొత్తగూడెం         సీఈఆర్‌క్లబ్‌             4000
మహబూబాబాద్‌        డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌ 7034
మహబూబ్‌నగర్‌     డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌              4896
నాగర్‌కర్నూల్‌         డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌          3865
గద్వాల్‌         డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌          4967
నల్గొండ         పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌         7480
నిజామాబాద్‌         పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌                  5313
రాచకొండ         సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్, అంబర్‌పేట     7737
రామగుండం         పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం     6341
సంగారెడ్డి         ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌         7065
సిద్దిపేట         పోలీస్‌ కమిషనరేట్‌                4409
సూర్యాపేట         డిస్ట్రిక్స్‌ పోలీస్‌ ఆఫీస్‌     5968
వరంగల్‌          పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం     7706


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.