* అభ్యర్థుల ఫిర్యాదు
ఈనాడు, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీఎస్-సెట్ పరీక్షల్లో ఆంగ్లభాష ప్రశ్నపత్రం-2లో 33 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు సక్రమంగా లేవని పలువురు అభ్యర్థులు టీఎస్-సెట్ నిర్వాహకుల దృష్టికి తీసుకువస్తున్నారు. మార్చి 17న అభ్యర్థులు ఆంగ్లభాష పరీక్షను రాయగా.. టీఎస్-సెట్ నిర్వాహకులు శనివారం(మార్చి 25) తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో ఉంచారు. వీటిని పరిశీలించిన అభ్యర్థులు 33 ప్రశ్నలకు సరైన సమాధానాలులేవని గుర్తించారు. ప్రశ్నలపై తమ అభ్యంతరాలను వారు టీఎస్-సెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆంగ్లభాష-1లో ఉన్న కొన్ని ప్రశ్నలను గూగుల్ నుంచి తీసుకుని మార్పులు, చేర్పులు చేసి.. వాటిని ఆంగ్ల ప్రశ్నపత్రం-2లో ఇచ్చారని పేర్కొన్నారు. టీఎస్-సెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.