* ఏప్రిల్ 3 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు
ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక సంస్థ(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 1న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీలోగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో అతికించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో మాత్రమే పరీక్ష జరుగనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.