• facebook
  • whatsapp
  • telegram

CUET-UG : 19న వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు మరోసారి సీయూఈటీ - యూజీ పరీక్ష

* ఎన్‌టీఏ వెల్లడి
 


దిల్లీ: వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు జులై 19న మరోసారి సీయూఈటీ - యూజీ పరీక్షను నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఈ మేరకు జులై 14న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్ష కేంద్రంలో తొలుత తాము ఎంపిక చేసుకోని భాషలో ప్రశ్నపత్రాలు పంపిణీ చేశారని, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకొని సరైనవి ఇచ్చారని, దీనివల్ల సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ వెయ్యి మంది అభ్యర్థులు ఆరు రాష్ట్రాలకు చెందినవారు. ఇదిలా ఉండగా జూన్‌ 30న విడుదల కావాల్సిన సీయూఈటీ - యూజీ ఫలితాలు ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. నీట్, నెట్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీయూఈటీ-యూజీ ఫలితాల విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. వాటి విడుదలపై స్పష్టత లేదు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.