* సబ్జెక్టుల వారీగా మార్కుల విశ్లేషణ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా అడిగిన ప్రశ్నలను గమనిస్తే, ‘ఈనాడు-ప్రతిభ’ వెబ్సైట్ అందించిన మోడల్ పేపర్ల నుంచి అధిక శాతం మార్కులు వచ్చాయి. వార్షిక పరీక్షలకు కొన్ని రోజుల ముందు సంవత్సరాల బోధనానుభం ఉన్న నిపుణులు రూపొందించిన మోడల్ పేపర్లను ‘ఈనాడు-ప్రతిభ’ విద్యార్థులకు అందించింది. అందులో ప్రతి సబెక్టుకు నాలుగు పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్ల నుంచి మొత్తం మీద సరాసరిన 78 శాతం ప్రశ్నలు ఫైనల్ పరీక్షల్లో కవర్ అయ్యాయి. అత్యధికంగా మొదటి సంవత్సరం ఫిజిక్స్ 93 శాతం మార్కులు, మ్యాథ్స్‌లో 81 శాతం; రెండో సంవత్సరం ఫిజిక్స్, బోటనీలో 93 శాతం మార్కులు, కెమిస్ట్రీ, జువాలజీలో 90 శాతం మార్కులు ఈనాడు-ప్రతిభ మోడల్ పేపర్ల నుంచి ఉండటం విశేషం. మొత్తంగా చూస్తే మొదటి సంవత్సరంలో 73 శాతం; రెండో సంవత్సరంలో 82 శాతం మార్కులు కవర్ అయ్యాయి. ఈ సందర్భంగా ఈనాడు-ప్రతిభ మోడల్ పేపర్ల ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
జూనియర్ ఇంటర్లో ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కుల వివరాలు
సబ్జెక్టు | మొత్తం మార్కులు | ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 55 |
ఇంగ్లిష్ | 100 | 50 |
గణితం 1A | 75 | 53 |
గణితం 1B | 75 | 69 |
భౌతికశాస్త్రం | 60 | 56 |
రసాయనశాస్త్రం | 60 | 54 |
వృక్షశాస్త్రం | 60 | 46 |
జంతుశాస్త్రం | 60 | 52 |
సీనియర్ ఇంటర్లో ‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కుల వివరాలు
సబ్జెక్టు |
మొత్తం మార్కులు |
‘ప్రతిభ’ మోడల్ పేపర్ల నుంచి వచ్చిన మార్కులు |
తెలుగు | 100 | 60 |
ఇంగ్లిష్ | 100 | 78 |
గణితం 2A | 75 | 69 |
గణితం 2B | 75 | 60 |
భౌతికశాస్త్రం | 60 | 56 |
రసాయనశాస్త్రం | 60 | 55 |
వృక్షశాస్త్రం | 60 | 56 |
జంతుశాస్త్రం | 60 | 54 |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.