• facebook
  • whatsapp
  • telegram

Anganwadi: అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్య  

* 15 నుంచి ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ (పూర్వ ప్రాథమిక) పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెగ్యులర్‌ పాఠశాలల్లో చేరేనాటికి పిల్లల్ని సంసిద్ధం చేయడమే సర్కారు ఉద్దేశం. ఇందుకోసం కొత్తగా ప్రీప్రైమరీ సిలబస్‌ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించేందుకు  జులై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమం చివరి రోజున సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించనుంది. 

తొలి విడతలో ప్రీప్రైమరీ పాఠశాలలుగా 10 వేల కేంద్రాలు

అంగన్‌వాడీ సేవల్లో పూర్వప్రాథమిక విద్య చాలా కీలకమని, పాఠశాలల్లో చేరేనాటికి అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్య అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 10 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దుతోంది. వీటిలో చేరే చిన్నారులకు యూనిఫాం అందించనుంది. అంగన్‌వాడీ టీచర్లకు ప్రీప్రైమరీ బోధన, చిన్నారుల ఆరోగ్యంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ప్రత్యేక కార్యక్రమంలో ఏ రోజు ఏం చేస్తారంటే..

15, 16 తేదీల్లో: అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, బాలికలు, స్వయంసహాయక బృందాలు, పాఠశాలల టీచర్లు, యువత, ఎన్జీవోలు, తల్లిదండ్రులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి.. చిన్నారులను అంగన్‌వాడీ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్చాలని కోరతారు. పాఠశాల, కళాశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను గుర్తిస్తారు. స్థానిక సర్పంచి, గ్రామాధికారి, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 

18వ తేదీ: ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తిస్తారు. పూర్వప్రాథమిక విద్య, అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధన పద్ధతులు, పాఠశాల విద్యకు సమాయత్తం చేయడం తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. 

19వ తేదీ: స్వచ్ఛ అంగన్‌వాడీ పేరిట కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. వాటి చుట్టూ మొక్కలు నాటుతారు. కిచెన్‌ గార్డెన్, తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలతోపాటు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తారు. కేంద్రాల్లో జులై నెలలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడిస్తారు.

20వ తేదీ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ డెవలప్‌మెంట్‌ డే, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నానమ్మ, అమ్మమ్మలను ముఖ్యఅతిథులుగా పిలిచి పూర్వప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు. కేంద్రాలకు సరఫరా అయిన బోధన, ఆట వస్తువులను చూపిస్తారు. పిల్లలను రోజూ ప్రీస్కూల్‌కు పంపిస్తున్న తల్లిదండ్రులకు పురస్కారాలు అందిస్తారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.